ధోనీపై మాజీ కెప్టెన్‌ ప్రశంసల వర్షం

SMTV Desk 2018-11-27 18:50:45  Dhoni, Ms Dhoni, Saurav Ganguly

న్యూ ఢిల్లీ, నవంబర్ 27: భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ప్రశంసల వర్షం కురిసించారు. ధోని వొక చాంపియన్‌ అంటూ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తారు. 2000 నుండి 2006 మధ్య కాలంలో టీం ఇండియాకు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ జరిగిన విషయాలను వెల్లడించారు. అప్పట్లో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారని గంగూలీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముషారఫ్ గంగూలీతో మాట్లాడుతూ ధోనీ అద్భుతంగా రాణిస్తున్నారని.. ధోనీని ఎక్కడ నుంచి పట్టకొచ్చారని అని అడిగితే.. వాఘా సరిహద్దు నుంచి తీసుకొచ్చామని ముషారఫ్‌తో గంగూలీ సరదాగా వ్యాఖ్యానించినట్లు ఆయన తెలిపారు. తాను సెలక్టర్‌ను కాదంటూనే గంగూలీ.. ప్రస్తుతం టీం ఇండియా జట్టు అద్భుతంగా రాణిస్తోందని.. జట్టులో మార్పులు ఉండకపోచ్చని గంగూలీ అన్నారు. ప్రస్తుత టీం నుంచి 85 నుంచి 90 శాతం వరల్డ్ కప్‌కు ఆడవచ్చని గంగూలీ అంచనా వేశారు.