చిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?: అజారుద్దీన్‌

SMTV Desk 2018-11-27 18:49:22  Azaruddin, congress, Bjp, Modi,

నల్గొండ, నవంబర్ 27: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని ఆ పార్టీ నేత, క్రికెటర్ ,మాజీ ఎంపి అజారుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన మోది ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.350 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత బిజెపిదని ఆయన విమర్శించారు. చిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా అని ఆయన ప్రశ్నించారు.