క్షమాపణ చెప్పిన అక్షయ్ కుమార్

SMTV Desk 2017-07-25 11:21:19  Akshay Kumar, apologized

ముంబై, జూలై 25 : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ క్షమాపణ చెప్పారు. ఇటీవల జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ చేరిన భారత మహిళా క్రికెట్ జట్టు మ్యాచ్ ను చూడటానికి అక్షయ్ కుమార్ లార్డ్స్ కు వెళ్ళారు. ఈ మ్యాచ్ ను వీక్షిస్తూ జాతీయ పతాకాన్ని పట్టుకొని భారత మహిళా క్రికెట్ జట్టును ఉత్సాహ పరుస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ జాతీయ పతాకాన్ని అపసవ్య దిశలో పట్టుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో అక్షయ్ కుమార్ క్షమాపణ చెప్పారు.