50 లక్షల ఉద్యోగాలు, రూ.5వేలు నిరుద్యోగ భృతి

SMTV Desk 2018-11-27 17:07:53  Rajsthan BJP Manifesto, vasundhara raje

రాజస్థాన్, నవంబర్ 27: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈరోజు జైపూర్‌లో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో రాజెతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ప్రకాశ్‌ జూవడేకర్‌లు, ఇతర బిజెపి నేతలు పాల్గొన్నారు. బిజెపి ఈసారి నిరుద్యోగులు, ఉద్యోగ కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టింది.

రానున్న ఐదేళ్లలో రాజస్థాన్‌లో ప్రైవేటు సెక్టార్‌లో 50లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాజె హామీ ఇచ్చారు. ఏటా ప్రభుత్వ రంగంలో 30వేల ఉద్యోగాలిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. 21ఏళ్లు పైబడిన అర్హులైన యువతకు నెలకు రూ.5వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా భారీ తాయిళాలు ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో నిరుద్యోగులు, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు.

రాజస్థాన్‌లో సుపరిపాలనకు తాము కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చగలిగామని సీఎం వసుంధర రాజె తెలిపారు. ప్రభుత్వం రూ.80వేల కోట్ల రుణాలు ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బేటీ పడావో పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.