నిరుద్యోగులకు శుభవార్త

SMTV Desk 2018-11-27 17:06:20  Andhra Pradesh, Appse posts

హైదరాబాద్, నవంబర్ 27: వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న 309 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌(ఏఈఈ) పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో రేపు ఏసీసీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కమిషన్‌ కసరత్తు పూర్తి చేసింది.తాజా నోటిఫికేషన్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు సంబంధించిన పోస్టులే సింహభాగం ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్‌లో మార్పు చేస్తున్నారు. ఎలాంటి సందిగ్ధత, అనుమానాలకు, వివాదాలకు తావులేకుండా నోటిఫికేషన్‌ను సిద్ధం చేస్తున్నారు.