చరణ్‌తో ఆడేందుకు.. ఇలియానా రెడీ

SMTV Desk 2018-11-27 12:25:12  చరణ్‌తో ఆడేందుకు.. ఇలియానా రెడీ

హైదరాబాద్, నవంబర్ 27: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి అందాల భామ ఇలియానా ఆడిపాడనున్నారట. చెర్రీ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ . ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్‌ నటిని తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోందని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. నటి అన్వేషణలో బోయపాటి ఉన్నారని.. చివరికి దర్శక, నిర్మాతలు ఇలియానాను కలిసినట్లు సమాచారం. అయితే దీనికి ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేశారట. వొక్క పాటకు రూ.60 లక్షల పారితోషికం అడినట్లు తెలుస్తోంది. ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

‘వినయ విధేయ రామ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. వివేక్‌ వొబెరాయ్‌‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.