డాక్టర్ గా మారిన తమన్నా..

SMTV Desk 2017-07-25 10:50:02  TAMANNAH, DOCTERATE, MOVIE, GUJARAATH,

హైదరాబాద్, జూలై 25 : తమన్నా ఇప్పుడు డాక్టర్ అయిందా అదేంటి.. ఆమె నటి కదా డాక్టర్ ఎప్పుడయిందని ఆశ్చర్యపోకండి. ‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా కు ‘హ్యాపీడేస్‌’తో మంచి క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకుల్ని తన నటనతో అలరిస్తున్న ఆమె సినిమా రంగంలో కష్టపడి పైకి రావడం, మంచి పేరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ, గుజరాత్‌కు చెందిన సీఐ ఏసీ సంస్థ "కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్ కమీషన్" గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న సంతోషాన్ని ఫేస్‌ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు తమన్నా. డాక్టరేట్‌ను అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీర్వాద బలం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ డాక్టరేట్ నటిగా తన బాధ్యతను పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికే నిరంతరం ప్రయత్నిస్తానని పేర్కొన్నది.