కుల్దీప్ @3

SMTV Desk 2018-11-26 19:22:10  Kuldeep yadav, t20 rankings,

దుబాయ్ , నవంబర్ 26:ఇటీవలికాలంలో నిలకడగా రాణిస్తున్నటీమిండియా యువ స్పిన్నర్ కుల్దీప్..ఆసీస్ టూర్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు . ఫలితంగా ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి బౌలింగ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. బ్యాట్స్ మెన్ల విభాగంలో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ లో 11వ స్థానంలో నిలిచాడు. టెస్టు, వన్డేల్లో నెంబర్ వన్ గా నిలిచిన సారథి కోహ్లీ ర్యాంకింగ్ 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంక్స్ లో బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కి చెందిన బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆలౌరౌండర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక జట్ల విషయానికి వస్తే 138 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా 127 స్థానంలో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. 118 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.