సినీ నటి కోసం కొట్టుకున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు

SMTV Desk 2018-11-26 19:21:22  Congress, Nagma, shivpuri

శివపురి, నవంబర్ 26:ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శివపురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మ అక్కడి వచ్చారు. ఆమె పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆమెను చూసేందుకు, దగ్గరగా వచ్చేందుకు ఎగబడ్డారు. ఆమె కోసం స్టేజి మీద ఉన్న ఇద్దరు నేతలు సైతం కొట్టుకున్నారు. వారిని వారించే ప్రయత్నాన్ని నగ్మా చేశారు.నగ్మ స్వయంగా సర్ధిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు