అయోమయంలో నాని

SMTV Desk 2018-11-26 17:28:48  Nani, Mahesh babu, jersy,

హైదరాబాద్ , నవంబర్ 26:సూపర్ స్టార్ మహేష్ ఎందుకు నానికి హెడ్డేక్ గా మారుతాడు. వొకవేళ మహేష్ సినిమా రిలీజ్ ఏదైనా నానికి సినిమాకు అడ్డుగా మారిందా అంటే మహేష్ మహర్షి ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేయగా నాని నటిస్తున్న జెర్సీ ఏప్రిల్ 19న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రెండు వారాలు గ్యాప్ ఉంది కాబట్టి నానికి పెద్దగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేదు. మరి ఎందుకు నానికి తలనొప్పిగా మారాడు అంటే నాని ఎంచుకున్న కథ అటుఇటుగా మహేష్ సినిమా కథకు దగ్గరగా ఉంటుందని దాని వల్ల నాని రిస్క్ లో పడ్డాడని తెలుస్తుంది.

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని చేయబోతున్న సినిమా కిశోరుడు అనే నూతన దర్శకుడు టేకప్ చేశాడు. ఈ సినిమా కథ విని ఓకే చేసిన నాని ఇంచుమించి ఈ కథ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా కథకు దగ్గరగా ఉండటంతో ఆలోచనలో పడ్డాడట.

వంశీ పైడిపల్లి రాసిన మహర్షి కథ కిశోరుడు నానికి చెప్పిన కథ మూలం వొకటే అట. అందుకే నాని కిశోరుడుకి మరో స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. దర్శకుడు ఆ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.