ఆస్ట్రేలియాదే టైటిల్

SMTV Desk 2018-11-26 17:24:49  Australai, England, women t20 worldcup

అంటిగ్వా, నవంబర్ 26: 2018 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. అంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది . ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి పరుగులు రావడం కష్టమైంది.

క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో ఇంగ్లీష్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు అలౌట్ అయ్యింది. ఓపెనర్ వ్యాట్ 43, కెప్టెన్ వైట్ 25 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సాయపడ్డారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆసీస్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ఫినిష్ చేసింది.

ఈ టైటిల్‌ను ఆసీస్ గెలవడం ఇది నాలుగోసారి.. ఇంతకు ముందు 2010, 12, 14లలో ఆస్ట్రేలియా జగజ్జేతగా ఆవిర్భవించింది. 2020 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది.