కెసిఆర్ పై రేవంత్ ప్రశ్నల వర్షం

SMTV Desk 2018-11-26 17:21:28  KCR, Revanth reddy, Congress, TRS

హైదరాబాద్, నవంబర్ 26:తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కెసిఆర్‌ ఉద్యోగం పోవాలని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు.

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేష్‌ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని స్వయంగా కెసిఆర్‌రే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కెసిఆర్‌ ఏం న్యాయం చేశారని ఈ సందర్భంగా రేవంత్‌ కెసిఆర్ ను ప్రశ్నించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు వొక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు.