మాధురీనే పెళ్లి చేసుకుంటా : సంజయ్ దత్

SMTV Desk 2017-07-25 10:39:10  madhuri deekshit, sanjay dath, love story, raaj kumaar hiraani, sanjay biopic, media question

ముంబై, జూలై 25 : బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సంజయ్‌ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాల వాడకం ఇంకా మాధురీ దీక్షిత్‌తో ప్రేమాయణం ఇలా ప్రతి ఒకటి సంచలనంగా మారింది. ఆ ఇద్దరూ సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ సంజయ్ బయోపిక్ తీయబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సంజయ్‌ ఓ ఈవెంట్‌కి హాజరు కాగా అక్కడి మీడియా ‘మీకు మరోసారి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే ఎవర్ని చేసుకుంటారు’ అని ప్రశ్నించిందట. ఈ ప్రశ్నకి ఆయన తడుముకోకుండా మాధురీ దీక్షిత్‌ అని చెప్పాడట. ఆ తర్వాత తాను జోక్‌గా అలా అన్నానని తనని తాను సమర్థించుకున్నారు.