20 మంది పోలీసులు హతం

SMTV Desk 2018-11-26 16:38:43  20 police killed, Kabul,

న్యూ ఢిల్లీ , నవంబర్ 26:ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు జరిపిన దాడిలో 20 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఫరాహ్‌ ప్రావిన్సులోని జవాన్‌ జిల్లాలో చోటు చేసుకుంది . ఆదివారం ఈ సంఘటన జరిగినట్లు అధికారులు ఈరోజు వెల్లడించారు. ఇటివల ఆఫ్ఘన్‌ ఆర్మీ,సెక్యూర్టీ ద‌ళాల‌పై తాలిబ‌న్లు వ‌రుస దాడుల‌తో చెల‌రేగిపోతున్నారు. అయితే ఫరాహ్ ప్రావిస్సులో పోలీసు కాన్వాయ్‌పై తాజాగా తాలిబ‌న్లు దాడి చేశారు. దాదాపు స‌గంపైన ప్రాంతాల్లో తాలిబ‌న్లు భీక‌ర దాడులు నిర్వ‌హిస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.