హెచ్‌-1బీ వీసా లో మరో మార్పు

SMTV Desk 2018-11-26 16:37:14  h1b visa, america,

న్యూ ఢిల్లీ , నవంబర్ 26:హెచ్‌-1బీ వీసాల విషయంలో దిగ్గజ దేశం అమెరికా మరింత కఠినంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో మార్పులు తేవాలని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) భావిస్తుంది. విదేశాల నుండి ఉద్యోగులను నియమించుకోదలిచని కంపెనీలు వార్షిక లాటరీ కంటే ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే పూర్తిస్థాయి దరఖాస్తులను ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పాలసీ విధానం వల్ల వీసా ప్రక్రియ మరింత విస్తృతం కానుంది.