ముంబయి ఉగ్రదాడులు నేటికీ పదేళ్లు

SMTV Desk 2018-11-26 16:25:52  Mumbai attack, 26-11 mumbai attack

న్యూ ఢిల్లీ , నవంబర్ 26:ముంబయి ఉగ్రదాడులు జరిగి ఈరోజుకి పదేళ్లు కావచ్చింది ఈదాడులు యావత్‌ భారతాన్ని వణికించింది. సముద్రమార్గం ద్వారా దేశంలోకి చోరబడి 10 మంది లష్కరే తోయిబా ముష్కరులు 12 ప్రాంతాల్లో దాడులు జరిపారు. 116 మంది ఆమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఈ దుర్ఘటనకు నేడు పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దాడిలో ఉగ్రవాదులతో పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు.

‘ముంబయి దాడి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులు, భద్రతాసిబ్బందికి సెల్యూట్‌. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు, బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు భారత్‌ కట్టుబడి ఉంటుంది అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు