చిదంబరానికి ఊరట

SMTV Desk 2018-11-26 16:21:45  chidambaram, patiyala high court

న్యూ ఢిల్లీ , నవంబర్ 26: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఊరట పొందారు. డిసెంబర్‌ 18వ తేది వరకూ వారిని అరెస్టు చేయకుండా పాటియాలా హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది . సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుపై గత నవంబర్ 1న కోర్టు ఈ ఇద్దరినీ నవంబర్ 26 వరకూ ఆరెస్టు చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ తిరిగి విచారణ సందర్భంగా ఆ గడువును డిసెంబర్ 18 వరకూ కోర్టు పొడిగించింది.