2.ఓ @180 కోట్లు

SMTV Desk 2018-11-26 14:23:56  robo 2.o, shanker, pre release buisiness

హైదరాబాద్, నవంబర్ 26: సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6800 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. రజినితో పాటుగా అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

సినిమా ఇప్పటికే భారీ ఎత్తున బిజినెస్ చేసింది. 2.ఓ ఇప్పటికే శాటిలైట్ రూపంలో 120 కోట్లు రాబట్టిందట. అన్ని భాషలు కలిపి ఇంత రాబట్టిందని తెలుస్తుంది. ఇక డిజిటల్ రైట్స్ రూపంలో కూడా 60 కోట్ల దాకా రాబట్టిందట. అంటే రిలీజ్ ముందు 180 కోట్లు తెచ్చిందన్నమాట. రిలీజ్ ముందే బడ్జెట్ రికవర్ చేసిన 2.ఓ బాహుబలి రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఎమీ జాక్సన్ హీరోయింగా నటిస్తున్న ఈ 2.ఓకు రెహమాన్ మ్యూజిక్ అందించారు. సినిమాలో ఐశ్వర్య రాయ్ కూడా స్పెషల్ రోల్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచుతుంది. ఈమధ్యనే తెలుగు సెన్సార్ పూర్తి చేసుకున్న 2.ఓ సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.