2.ఓ డూప్ తోనే ఎక్కువ నడిపించారా..?

SMTV Desk 2018-11-26 12:17:09  robo 2.o

హైదరాబాద్, నవంబర్ 26: సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో రజిని రోబో చిట్టిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో రోబో లుక్ కోసం చాలా ఎక్కువ బరువున్న కాస్టూం ధరించాల్సి వచ్చిందట. అయితే దీనికి రజిని ఆరోగ్యం సహకరించలేదట. అందుకే డూప్ తో కానిచ్చారని అంటున్నారు.

రోబో టైంలోనే చాలా వరకు డూప్ తోనే సీన్స్ తీశామని అప్పట్లో శంకర్ చెప్పారు. ఇక ఇప్పుడు 2.ఓకు అదే ఫార్ములా పాటించి ఉంటారని తెలుస్తుంది. అంటే 2.ఓ దాదాపు డూప్ రజినికాంత్ తోనే నడిపించారన్నమాట. డూప్ అయినా సరే రజిని యాక్షన్, స్టైల్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారట. 2.ఓ షూటింగ్ టైంలోనే రజినికాంత్ అనారోగ్య పాలవడంతో డూప్ తో కానివ్వక తప్పలేదట.