మైత్రి మూవీస్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సినిమా

SMTV Desk 2018-11-25 18:31:51  Kalyan ram, Mythri Movies,

హైదరాబాద్, నవంబర్ 25:టాలీవుడ్ స్టార్ హీరోల్లో వొకరైన ఎన్.టి.ఆర్ కెరియర్ సూపర్ హిట్ సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. టెంపర్ ముందు దాకా సినిమా సెలక్షన్ విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్న తారక్ టెంపర్ నుండి కథల విషయంలో తన పంథా మార్చుకున్నాడు. తన కెరియర్ ఎలాగు సూపర్ ఫాంలో కొనసాగుతుండగా అన్న కళ్యాణ్ రాం విషయంలో ఆలోచనలో పడ్డాడు.

సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నా మంచి ఫలితాలు రాబట్టలేని కళ్యాణ్ రాం బయట సినిమాలు పెద్దగా రాబట్టడం లేదు. అందుకే కళ్యాణ్ రాం కెరియర్ పై ఎన్.టి.ఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అన్న కెరియర్ ను హిట్ ట్రాక్ ఎక్కించేందుకు ప్లాన్ తో తారక్ సూపర్ హిట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో మాట్లాడుతున్నాడట.

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం మూడు వరుస హిట్లు కొట్టిన మైత్రి నిర్మాతలు ఈమధ్య వచ్చిన సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు నిరాశ పరచాయి. మైత్రి మూవీ మేకర్స్ తో కళ్యాణ్ రాం సినిమా ప్లాన్ చేస్తున్నారట. దీనికి ఎన్.టి.ఆర్ ప్రధాన కారణమని తెలుస్తుంది.