తమ్ముడి భార్యను వివస్త్రను చేసి...

SMTV Desk 2017-07-24 20:13:03  rape, karimnagar, vinavanka, bhumreddy,

కరీంనగర్, జూలై 24: మహిళలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తోటి మహిళపై తన ముందే లైంగిక దాడి చేస్తున్నా కన్నుల పండుగగా తిలకించడమే కాకుండా అందుకు సహకరించింది ఓ అత్త. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా వీణవంకలో పొలం పని చేస్తున్న ఓ మహిళను తన బావ భూంరెడ్డి వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ తతంగానంతా మొబైల్ లో చిత్రీకరించాడు. ఈ లైంగిక దాడికి అత్తమామ కూడా సహకరించారు. ఈ ఘటనపై వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో బాధితురాలు హెచ్ ఆర్ సి ఆశ్రయించింది. స్పదించిన హెచ్ ఆర్ సి సెప్టెంబర్ 25 లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సీపీని ఆదేశించింది. స్థానిక బిజెపి నేత లక్ష్మణ్ ను బాధితురాలు కలిసి తన గోడును వెళ్లబుచ్చుకోగా, ఆమెకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు. లైంగిక దాడికి పాల్పడిన భూంరెడ్డిపై నిర్భయ కేసు పెట్టాలని బాధితురాలు కోరింది.