మన్మధుడు-2 వచ్చేస్తుంది

SMTV Desk 2018-11-24 18:29:11  Manmadhudu 2, nagarjuna

హైదరాబాద్, నవంబర్ 24: టాలీవుడ్ కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీస్ లో వొకటైన మన్మధుడు నాగ్ కెరియర్ లో ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. త్రివిక్రం కథ, మాటలు అందించిన ఈ సినిమాను విజయ భాస్కర్ డైరెక్ట్ చేశారు. 2002లో వచ్చిన ఈ సినిమాకు ఇన్నేళ్లకు సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సీక్వల్ కు త్రివిక్రం డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే త్రివిక్రంకు ఈ సీక్వల్ మీద అంత ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది.

ఇక ఈమధ్యనే చిలసౌ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో మన్మధుడు సీక్వల్ చేస్తున్నాడట నాగార్జున. ఈమధ్యనే ఫైనల్ స్క్రిప్ట్ ఓకే చేశారని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది. చిలసౌ సినిమా డీల్ చేసిన విధానం నచ్చి రాహుల్ రవింద్రన్ కు ఈ ఛాన్స్ ఇచ్చాడట నాగార్జున. వొక్క సినిమాతో నాగ్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు రాహుల్.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మన్మధుడు-2 హిట్ కొడితే మాత్రం దర్శకుడిగా రాహుల్ రవింద్రన్ కు మంచి క్రేజ్ వచ్చినట్టే. అందాల రాక్షషి సినిమాతో నటుడిగా పరిచయమైన రాహుల్ ఓ పక్క సినిమాలు చేస్తూ డైరక్టర్ గా బిజీ అవనున్నాడు.