మరో సారి సత్తా చాటిన విజయ్ దేవరకొండ

SMTV Desk 2018-11-24 18:25:55  Vijay devarakonda, Taxiwala

హైదరాబాద్, నవంబర్ 24: అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా కూడా హిట్ ఖాతాలో చేరింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన దేవరకొండ విజయ్ టాక్సీవాలా ఫస్ట్ వీక్ లో 17 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే గీతా గోవిందం తొలివారం 30 కోట్ల దాకా వసూళు చేసింది. అన్ని సినిమాల ఫలితాలు వొకేలా ఉండవు కాబట్టి ప్రస్తుతం టాక్సీవాలా సక్సెస్ ను విజయ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

నోటా ఫ్లాప్ తర్వాత ఆల్రెడీ సినిమా మొత్తం లీకైన టాక్సీవాలా హిట్ అవడం విజయ్ ను మళ్లీ నిలబెట్టిందని చెప్పొచ్చు. వొకవేళ ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే అతని కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేది. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన టాక్సీవాలా సినిమాలో విజయ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ డైరక్షన్ లో డియర్ కామ్రెడ్ సినిమాతో పాటుగా సినిమా చేస్తున్నాడు. సినిమా సినిమాకు పెద్దగా గ్యాప్ లేకుండా విజయ్ కెరియర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని చెప్పొచ్చు.