'2.o' లో ఐష్

SMTV Desk 2018-11-24 17:46:40  super star Rajinikanth, aishawarya rai

హైదరాబాద్, నవంబర్ 24: శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ మరో 4 రోజుల్లో రిలీజ్ అవనుంది. ప్రపంచవ్యాప్తంగా 6800 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్ది సినిమా నుండి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సినిమా ట్రైలర్ ఇప్పటికే భారీ రికార్డులను కొల్లగొట్టగా రజిని, అక్షయ్ కుమార్ ల మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయట. కచ్చితంగా 2.ఓ వొ ఐ ఫీస్ట్ మూవీగా అవుతుందని అంటున్నారు.

సెన్సార్ నుండి పాజిటివ్ స్పందన రావడంతో చిత్రయూనిట్ మరింత జోష్ తో ఉన్నారు. ఇక ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే చిన్న కెమియో రోల్ గా ఐశ్వర్య రాయ్ కనిపిస్తుందట. రోబో సినిమాలో చిట్టిని ప్రేమలో పడేసిన ఐశ్వర్య ఈ సినిమాలో కూడా సడెన్ సర్ ప్రైజ్ ఇస్తుందట. ఇది శంకర్ చేసిన ప్లాన్ అని తెలుస్తుంది. 2.ఓ హీరోయిన్ ఎమీ జాక్సన్ మాత్రం సినిమాలో రోబోగా మారినట్టు తెలుస్తుంది.

600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న 2.ఓ తెలుగులోనే 70 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ ముందే 300 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మరి రిలీజ్ తర్వాత మిగిలిన కలక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.