ఆసక్తి రేపుతున్న రాం చరణ్ ట్రెడిషన్ లుక్

SMTV Desk 2018-11-24 17:43:37  ram charan, vinaya vidheta rama,

హైదరాబాద్, నవంబర్ 24: రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమాల జోరు పెంచాడని చెప్పాలి. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న వినయ విధేయ రామ సెట్స్ మీద ఉండగానే రాజమౌళితో మల్టీస్టారర్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. బోయపాటి సినిమా మరికొద్ది రోజుల్లో పూర్తి కావొస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ నుండి వచ్చిన టీజర్ మెగా ఫ్యాన్స్ ను అలరించింది. ఇక కార్తిక పౌర్ణమి సందర్భంగా సినిమా నుండి రాం చరణ్ మరో లుక్ రివీల్ చేశారు.

రాం చరణ్ ట్రెడిషన్ లుక్ తో వి.వి.ఆర్ సెకండ్ పోస్టర్ వచ్చింది. మొదటి పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపించిన రాం చరణ్ ఈసారి క్లాస్ లుక్ తో అదరగొట్టాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాను రాబోయే సంక్రాంతి బరిలో దించబోతున్నారని తెలుస్తుంది.