బ్యాచులర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పిన టాలీవుడ్‌ విలన్‌

SMTV Desk 2018-11-24 14:03:32  Tollywood Villain, Harish Uttaman

హైదరాబాద్, నవంబర్ 24:తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న హరీశ్ ఉత్తమన్ తన బ్యాచులర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పారు. హరీశ్ ఉత్తమన్ తెలుగులో పవర్, పండగ చేస్కో, జిల్, గౌరవం, శ్రీమంతుడు, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, దువ్వాడ జగన్నాథమ్, జై లవ కుశ, నా పేరు సూర్య సినిమాలలో విలన్‌గా నటించాడు.

తన గర్ల్ ఫ్రెండ్ అయిన అమృతా కల్యాణపూర్‌ని ఈ నెల 6న వివాహం చేసుకున్నారట. కానీ ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో వీరి వివాహం సింపుల్‌గా అతికొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య జరిగింది. గత 8 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.