టిఆర్‌ఎస్‌ పాలనలో సామాజిక న్యాయం జరగలేదు

SMTV Desk 2018-11-24 12:54:42  TRS, revanth reddy,

హైదరాబాద్ , నవంబర్ 24: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఈరోజు బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను పార్టీకోసం కేసీఆర్‌ వాడుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు . అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టిఆర్‌ఎస్‌ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, ఆయన ఆరోపించారు.