పాకిస్థాన్‌ కు అమెరికా ఝలక్

SMTV Desk 2018-11-24 12:48:26  pakistan, america,

వాషింగ్టన్ , నవంబర్ 24: పాకిస్థాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందే 1.3 బిలియన్‌ డాలర్ల భద్రతా పరమైన సహకారాన్ని అగ్ర రాజ్యం నిలిపివేసింది. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికారి ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్‌ వైఖరి మార్చుకోకపోవడంతోనే ఆ దేశానికి భద్రతా సహకారాన్ని నిలువరించి అమెరికా కఠిన నిర్ణయం తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్‌ఖైదా చీఫ్‌ వొసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ తెలిసినా కూడా పాక్‌ ప్రభుత్వం అమెరికాకు చెప్పలేదని ట్రంప్‌ ఆరోపించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరగడం గమనార్హం.