పాకిస్థాన్‌లో భారీ పేలుడు

SMTV Desk 2018-11-23 19:24:12  pakistan, bomb blast in pakistan

పాకిస్తాన్ , నవంబర్ 23: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. హంగు ప్రాంతంలోని ఓరక్‌జాయ్‌ ప్రాంతంలో గల జుమా బజార్‌లో ప్రతి శుక్రవారం మార్కెట్ జరుగుతుంటుంది. ఇది చాలా రద్దీగా ఉంటుంది. దీనిని లక్ష్యంగా చేసుకుని దుండగులు పేలుళ్లకు పాల్పడినట్టు భద్రతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. దీని పై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.