కళ్యాణ్ దేవ్ మరో ప్రయత్నం

SMTV Desk 2018-11-23 19:03:56  Mega hero, Kalyan dhev,

హైదరాబాద్, నవంబర్ 23: మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఈమధ్యనే హీరోగా వచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత ఆకట్టుకోలేదు. రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన విజేత అంచనాలను అందుకోలేదు. అయితే ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో కళ్యాణ్ దేవ్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ దేవ్ రెండో సినిమా పులి వాసు డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా షూటింగ్ త్వరలో మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చేస్తున్న ఈ రెండవ ప్రయత్నం ఏమేరకు అలరిస్తుందో చూడాలి. విజేతలో తన అభినయానికి మంచి మార్కులు పడలేదు. అందుకే ఈసారి కళ్యాణ్ సత్తా చాటాలని చూస్తున్నాడు.