ఒకే వేదికపై మెగా బ్రదర్స్

SMTV Desk 2018-11-23 18:56:34  chiranjeevi, pawan kalyan

హైదరాబాద్, నవంబర్ 23: మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వొకే వేదికపై కనిపిస్తే ఇక మెగా అభిమానుల ఆనందానికి అవధులుండవు. చాలా రోజుల తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి వొకే వేడుకలో కనిపించి సందడి చేయనున్నారు. ఇంతకీ ఏ సినిమా ఫంక్షన్ కు ఈ బ్రదర్స్ కలిసి వస్తున్నారు అంటే ఇంకెవరు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చిరు, పవన్ వస్తున్నారట.

వరుణ్ తేజ్ హీరోగా ఘాజితో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా అంతరిక్షం. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కాబోతుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 9న ఫిక్స్ చేశారు. ఆ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి అటెండ్ అవనున్నారట. మెగా ఈవెంట్ గా రాబోతున్న ఈ సినిమా మెగా సంబరం అభిమానులను ఆనందోత్సవాల్లో మునిగి తేలేలా చేయడం ఖాయమని చెప్పొచ్చు.