దుర్గమ్మ గుడిలో అపచారం

SMTV Desk 2017-07-24 17:32:08  durgaa devi, temple, vijayawaada.

విజయవాడ, జూలై 24 : ఎంతో పవిత్రంగా కొలిచే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి ప్రసాదాలను తినగా మిగిలినవి భూమిలో గొయ్యి తీసి పాతిపెట్టాలన్న నియమం అమలులో ఉంది. కాని దీనికి విరుద్దంగా అక్కడి ఆలయ సిబ్బంది అమ్మవారి ప్రసాదాన్ని చెత్తకుండీలో వేశారు. దీంతో కోపోద్రోక్తులైన భక్తులు అసలు పవిత్రమైన అమ్మవారి ప్రసాదాన్ని ఎలా చెత్తకుండీలో వేస్తారంటూ ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.