28,29 తేదీల్లో రాహుల్ – చంద్రబాబు ప్రచారం

SMTV Desk 2018-11-23 17:06:25  rahul gandhi, chandra babu naidu,

హైదరాబాద్, నవంబర్ 23: మహాకూటమిలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి ఈ నెలలో రెండు రోజుల పాటు డేట్స్ ఫిక్స్ అయ్యాయి… తెలంగాణలో తెరాసను ఓడించి అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఏర్పడిన మహాకూటమి పొత్తులో భాగంగా ఇరు పార్టీల

నేతలు 28,29 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. వొకే వేదికను రాహుల్ – చంద్రబాబు పంచుకుంటూ వారి ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఏపీ మంత్రులు సైతం ప్రచారానికి వస్తారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ వెల్లడించారు.