నిర్మాతగా యంగ్ హీరో ?

SMTV Desk 2018-11-23 15:38:11  Sundeep Kishan, producer,

హైదరాబాద్, నవంబర్ 23: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ సినిమాలైతే వరుసగా చేస్తున్నాడు కాని అందుకు తగిన ఫలితాలను అందుకోవడంలో మాత్రం వెనుకపడుతున్నాడు. ఓ పక్క నాని, విజయ్ దేవరకొండ ఫుల్ ఫాంలో ఉండగా సందీప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కాని హిట్ కొట్టడం లేదు. ప్రస్తుతం నెక్స్ట్ ఏంటి అంటూ తమన్నాతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్న సందీప్ కిషన్ ఇలా అయితే కుదరదు అనుకున్నాడో ఏమో కాని తానే నిర్మాతగా మారి ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడట అని తాజా సమాచారం

కార్తిక్ రాజు అనే తమిళ నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తను స్థాపించిన వెంకటాద్రి టాకీస్ బ్యానర్ లో సందీప్ కిషన్ ఈ సినిమా చేస్తున్నాడట. సూపర్ నాచురల్ పవర్స్ నేపథ్యంలో కథ సాగుతుందట. హీరో కమ్ ప్రొడ్యూసర్ గా సందీప్ కిషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో కాని ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిర్మాతగా మారిన సందీప్ కిషన్ కు ఈ సినిమా అయినా హిట్ దక్కేలా చేస్తునో లేదో చూడాలి.