పాక్‌ పోర్టు సిటీ కరాచీలో కలకలం

SMTV Desk 2018-11-23 15:18:25  Pakistan, Pak Port, China, Karachi,

పాకిస్తాన్ పోర్టు సిటీ కరాచీలో కలకలం చెలరేగింది. కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలోని క్లిప్టన్‌ ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. పాక్‌లోని చైనా రాయబార కార్యాలయంలోకి చొరబడేందుకు నలుగురు సాయుధులు ప్రయత్నం చేయగా, చెక్‌ పాయింట్‌ వద్ద కరాచీ, నవంబర్ 23: సెక్యూరిటీ నిలువరించగా వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్‌ చనిపోగా మరో కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.సంఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ అత్యంత సన్నిహిత మిత్రపక్షాల్లో చైనా వొకటి. చైనా ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌కు బిలియన్ల ఆర్థిక సాయం అందజేసింది. అరేబియా సముద్రంతో చైనా పశ్చిమ ప్రావిన్స్‌ను అనుసంధానం చేసేందుకు చైనా అనేక నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది.