'ది లయన్ కింగ్' ట్రైల‌ర్

SMTV Desk 2018-11-23 15:07:57  The Lion King, Lion king trailer

హైదరాబాద్, నవంబర్ 23: డిస్నీ సంస్థ నుండి వ‌చ్చిన యానిమినేష‌న్ సినిమాలు సిండ్రెల్లా, ద జంగ‌ల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోగా, ఇప్పుడు అదే సంస్థ నుండి ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



దాదాపు పాతికేళ్ల క్రితం లో వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రం ద ల‌య‌న్ కింగ్‌కి ఉన్న‌త ప్ర‌మాణాలు జోడించి 3డీ యానిమేష‌న్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు.తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు యానిమేష‌న్ ల‌వ‌ర్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలకి కూడా ఈ చిత్ర ట్రైలర్ న‌చ్చ‌డంతో వారు విప‌రీతంగా షేర్ చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్లోవర్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫర్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు వివిధ జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం గమనార్హం

నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 19, 2019న విడుద‌ల కానుంది. విడుద‌లైన కొద్ది స‌మ‌యంలోనే చిత్ర ట్రైలర్ 4 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.