బన్నీ సరసన అందాల తార

SMTV Desk 2018-11-23 15:05:10  Stylish star allu arjun, 96 remake,

హైదరాబాద్, నవంబర్ 23: తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన సినిమా 96 . యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా తమిళనాట ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలు మొదలు పెట్టాడట కూడా.

నాని, బన్ని ఇద్దరిలో ఎవరో వొకరు 96 తెలుగు రీమేక్ చేస్తారని టాక్. నాని కన్నా బన్ని ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. స్టార్ హీరో అయినా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలే చేస్తూ వస్తున్న భావనలో ఉన్న బన్ని 96 రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట. ఇక రీమేక్ లో కూడా త్రిషనే తీసుకునే అవకాశాలు ఉన్నాయట.

తెలుగులో త్రిషకు ఇంకా ఫాలోయింగ్ ఉంది. బన్ని, త్రిష 96 రీమేక్ కచ్చితంగా ఇది కొత్త ప్రయత్నంగా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది.