'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' వీడియో సాంగ్ విడుదల

SMTV Desk 2018-11-23 15:01:25  Padi Pdi leche manasu, sharwanand

హైదరాబాద్, నవంబర్ 23: యంగ్ స్టార్ శ‌ర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం "పడి పడి లేచే మనసు". సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. . డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్ జోరు పెంచారు. తాజాగా చిత్ర టైటిల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో సాయి ప‌ల్ల‌వి, శ‌ర్వానంద్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో శ‌ర్వా మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోనున్నాడ‌ని తెలుస్తుంది.

కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు .