బాహుబలి రికార్డులను తిరగరాసిన '2.ఓ '

SMTV Desk 2018-11-23 13:10:27  Baahubali, 2.0 , rajinikanth

హైదరాబాద్ , నవంబర్ 23: మరో ఆరు రోజుల్లో విడుదల కానున్న ఈ సంవత్సరం భారీ బడ్జెట్ ఫిల్మ్ 2.ఓ విడుదలకు ముందే రాజమౌళి బాహుబలి రికార్డును అధిగమించింది.

బాహుబలి రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదల చేయగా, 2.ఓ 6,800 థియేటర్లలో విడుదల కానుంది అని తాజా 3డీ టెక్నాలజీ, 4డీ సౌండ్ తో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త విందు అందించడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా విదేశాల్లో 4 వేల థియేటర్లలో విడుదల కానుందని, ఇండియాలో 2,800 థియేటర్లలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తదితరులు నటించగా, శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.