జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

SMTV Desk 2018-11-23 10:56:18  Mahatma Gandhi, Ram Nath Kovind

సీడ్నీ, నవంబర్ 23: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆయన గురువారం సీడ్నీ సమీపంలో ఉన్న పర్రమట్ట సిటిలోని జూబ్లీ పార్క్‌ వద్ద గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు గాంధీజీ 150వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్‌తో కలిసి కోవింద్ మహాత్మునికి నివాళులు అర్పించారు.



మహాత్ముడు చెప్పిన అహింస, శాంతి సందేశాలు ప్రపంచం నలుమూలలా ప్రాచుర్యం పొందాయని ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తు చేశారు. మహాత్ముని కీర్తి, అతను బోధించిన విలువలు విశ్వవ్యాప్తమయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. భారత్‌లోలాగే భిన్న సంస్కృతులు, కులమతాలు ఉన్న ఆస్ట్రేలియాలాంటి సమాజాలను గాంధీ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆయన పేర్కొన్నారు.

ఇండో ప‌సిఫిక్ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని రామ్‌నాథ్ కొనియాడారు ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన సిద్ధాంతాల‌కు, క్రికెట్ సంబంధాల‌కు రెండు దేశాలు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్నారు. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. భార‌త్‌లో త‌యారైన రైలు బోగీలు ఆస్ట్రేలియాకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని రామ్‌నాథ్ అన్నారు