కేసిఆర్ ఎన్నికల ఖర్చుపై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం

SMTV Desk 2018-11-21 18:42:22  Telangana asembly elections, election commission, rajath kumar, chandra shekar rao

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నికల ఖర్చు పై దృష్టి సారించారు. హెలీ కాప్టర్ బుకింగ్ ఛార్జీలతో సహా ఇతర ఎన్నికల ఖర్చులను తగిన విధంగా లెక్కించడానికి కి చర్యలు తీసుకోవాల్సింది గా అన్నీ జిల్లాల కలెక్టర్లు, రిటర్నంగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆపధర్మ ముఖ్యమంత్రి TRS స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్.. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. వొకే రోజులో మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. అందుకు గాను ప్రచారంలో హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు. అయితే కేసీఆర్ ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని కలెక్టర్, రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు.

కేసీఆర్ ఎన్నికల పర్యటన విషయమై తగిన ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ భారత ప్రధాన ఎన్నకల కమిషన్ ను కోరింది. కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో హెలిపాడ్స్ ను నిర్మించి అక్కడ హెలీకాప్టర్ దిగేందుకు తగిన ఏర్పాట్లు చేసేలా జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్ లను ఆదేశించాలని కోరింది. ఈ మేరకు నవంబర్ 17న టీఆర్ ఎస్ జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస రెడ్డి కమిషన్ ను అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషన్ హెలీపాడ్స్ నిర్మించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కాగా ఆపధర్మ సీఎం కేసీఆర్ గ్లోబల్ వెక్ట్రా వారి ఏడబ్ల్యూ 169 హెలీకాప్టర్ ను ప్రచారం లో వినియోగిస్తున్నారు. ఈ హెలీ కాప్టర్ లో 10 మంది ప్రయాణించివచ్చు.29 ప్రాంతాల్లో హెలీ కాప్టర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 19 న ఖమ్మం లో పారంభమైన కేసీఆర్ ఎన్నికల పర్యటన నవంబర్ 25 న ఇబ్రహీం పట్నంలో ముగియనుంది.