విదేశీ గడ్డపై తెరాస ప్రచార హోరు

SMTV Desk 2018-11-21 17:26:06  TRS, Australiya, t20 , team india

బ్రిస్బేన్, నవంబర్ 21: బ్రిస్బేన్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ పార్టీపై అభిమానం ఎల్లలు దాటిపోతు గులాబీ పార్టీ ప్రచారం హోరెత్తిపోయింది.

మ్యాచ్ తిలకిస్తున్న తెలంగాణ యువకులు కేసీఆర్ ప్లకార్డులు చూపించారు. కేసీఆర్ జిందాబాద్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు. కారు గుర్తుకు ఓటేయాలని నినాదాలు చేశారు. కేసీఆర్.. కీప్ కార్ రన్నింగ్ అని కేకలు వేశారు. కొంతమంది విదేశీయులు కూడా ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. ఈ ఫొటోలను టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ట్విటర్లో షేర్ చేశారు.