అల్లు అర్జున్ బేబీ డాల్ బర్త్ డే.. వైరల్ అవుతున్న ఫొటో

SMTV Desk 2018-11-21 16:06:11  Alllu Arjun, Stylish Star, arha

హైదరాబాద్ నవంబర్ 21: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బేబీ డాల్ అర్హ పుట్టిన రోజు ఈ రోజు . ఈ సందర్భంగా తన గారాలపట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అర్హ సెకండ్ బర్త్ డే ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి .

ఇక ఫోటో విషయానికి వస్తే ఫొటోలలో అర్హ బ్లూ కలర్ గౌనులో చిరు నవ్వులు చిందిస్తూ.. రెండవ పుట్టిన రోజుకి చిహ్నంగా ‘TWO అనే లెటర్స్‌తో కూడిన డాల్స్‌తో ఆడుకుంటూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. ‘నా చబ్బీ డాల్ అర్హకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బన్నీ షేర్ చేసిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ అర్హకి బర్త్ డే విషెష్‌ని తెలియజేస్తున్నారు.