'సీతాకాత్తి' ఎమోషనల్‌ ట్రైలర్

SMTV Desk 2018-11-21 15:20:54  Vijay sethupathi, seethaakathhi trailer, seethakathhi

చెన్నై, నవంబర్ 21: విజయ్ సేతుపతి 25వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం సీతాకాత్తి . బాలాజీ తరనీతరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. వొక ఆర్టిస్ట్ జీవితకథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ వృద్ధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్‌గా వచ్చిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక పాషన్ స్టూడియో పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. విజయ్ సేతుపతి 25వ చిత్రంగా తెరకెక్కిన సీతాకాత్తిపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.