నేడు భారత్-ఆసిస్ టీ20 ప్రారంభం

SMTV Desk 2018-11-21 11:27:38  Kohli, australia,t20 series, india

బ్రిస్బేన్, నవంబర్ 21: భారత జట్టు నేటి నుండి ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దంగా వుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం(నవంబర్ 21) మ. 1.20 గంటలకి జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు.. ఆసీస్ టూర్‌ను విక్టరీతో స్టార్ట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఆసిస్ మాత్రం సొంతగడ్డపై కోహ్లి సేనను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసింది.

మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఆసీస్ జట్టులో లేకపోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ వుహిస్తున్నాడు.

తేదీ: నవంబర్ 21, బుధవారం
మ్యాచ్: భారత్ Vs ఆస్ట్రేలియా, తొలి టీ20
సమయం: మ. 1:20 గంటలకు
వేదిక: గబ్బా స్టేడియం, బ్రిస్బేన్
టీ20ల్లో ఇరు జట్లు ముఖాముఖి:
అంతర్జాతీయ టీ20ల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 15 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 సార్లు విజయం సాధించగా, ఆస్ట్రేలియా 5 సార్లు విజయం సాధించింది.

కాగా, ఆసీస్‌లో ఇప్పటివరకు భారత్ వొక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. దీంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఈసారి టెస్టు సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని దూకుడుగా వుంది.