మోహన్ లాల్ ‘ఒడియన్’ వచ్చేస్తుంది

SMTV Desk 2018-11-21 11:16:56  odiyan, Mammotti,

చెన్నై, నవంబర్ 21: మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘వొడియన్ విడుదలతేదీ ఖరారైయింది. ఈచిత్రం మళయాళంతో పాటు తెలుగులోనూ డిసెంబర్ 14న విడుదలకానుంది.దగ్గుబాటి రామ్ .. సంపత్ కుమార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో మృగంగా మారే మనిషి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. అద్భుతమైన లొకేషన్స్ ఆశ్చర్య చకితులను చేస్తాయనీ .. గ్రాఫిక్స్ మంత్రముగ్ధులను చేస్తాయని చెబుతున్నారు.ఇక ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్ స్టంట్ మాస్టర్ కాగా జయచంద్రన్ సంగీతం అందించారు.