కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

SMTV Desk 2017-07-24 16:03:39  

హైదరాబాద్, జూలై 24 : రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా ట్వీటర్ లో శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ, రే ట్వీట్ చేసి తెలుగు రాష్ట్రాల పరస్పర అభివృద్ధికి కలసి పనిచేదాం అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ , ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ కు పిలుపును ఇచ్చారు కేటీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలసి సాకుదం అని స్నేహ హస్తం అందించారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు. లోకేష్ ట్వీట్‌పై కేటీఆర్ కూడా స్పందించి లోకేష్‌కు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో కేటీఆర్ ను శుభాకాంక్షలు తెలుపుతున్నారు.