మల్టీస్టారర్ గా వస్తున్న నాని

SMTV Desk 2018-11-20 18:31:33  Nani, Mohan krishna indraganti, nikhil

హైదరాబాద్, నవంబర్ 20: గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్తున్ననాచురల్ స్టార్ నానికి ఈ ఏడాది వొచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు నిరాశపరచాయి. నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తుండగా నిఖిల్ ముద్ర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దేవదాసు తరువాత మల్టీస్టారర్ సినిమాలు చేయనని నిర్ణయించుకున్న నానికి మల్లీ వొక మంచి మల్టీస్టారర్ కథను యువ హీరో నిఖిల్ తో కలిసి చేద్దామని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పాడట. నానిని అష్ట చమ్మతో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఆ తర్వాత జెంటిల్మన్ సినిమా చేశాడు. రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. మరి నాని, నిఖిల్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
కచ్చితంగా కథాబలం ఉండుంటుంది కాబట్టే నాని ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటాడని అనుకుంటున్నారు.