రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన లో రాణిస్తాడా ?

SMTV Desk 2018-11-19 19:33:39  Rohit Sharma, Australia,

పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ వొక మొనగాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఏ జట్టు అయినా సరే క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం అతని ఆటతో చుక్కలు చూపిస్తాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా రోహిత్ ఆడే ఇన్నింగ్స్ లు ప్రత్యర్ధులకు భయాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం రోహిత్ భీకర ఫాం లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఆసిస్ పర్యటనలో అతను ఏ మేరకు రాణిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. తాజాగా రోహిత్ గురించి ఆసిస్ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌నైల్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు. అతడో నమ్మశక్యం కాని ఆటగాడని... రికార్డులే అతడి గురించి చెప్తాయన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మంచి గణాంకాలు నమోదు చేశాడని కొనియాడుతూ.... అందుకే అతడిని ఓ కంటకనిపెట్టడం అవసరమని అభిప్రాయపడ్డాడు. అయితే రోహిత్‌ను కొత్త బంతితో బోల్తా కొట్టించడంలో తమకు అనుభవం ఉందన్నాడు. జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ చివరిసారి ఆడినప్పుడు రోహిత్‌ను ఔట్‌ చేసిన సంగతి గుర్తు చేసాడు. ఈ సారీ త్వరగా అదే చేయాలని కోరుకుంటున్నామన్నాడు. కాగా ఈ నెల 21 న ఇరు జట్ల మధ్య మొదటి టి20 జరగనుంది.