ఖమ్మం లో పది సీట్లు గెలుస్తామన్న సీఎం కెసిఆర్

SMTV Desk 2018-11-19 19:31:57  KCR, Khammam, Elections

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి తీరుతామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల, ఇతర నేతలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు ప్రాణాధారమైన సీతారామ ప్రాజెక్టును ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తిచేసి తీరుతామన్నారు. సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబును ఖమ్మం జిల్లా ప్రచారానికి వస్తే నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న చంద్రబాబు.. తెలంగాణలో ఎలా ప్రచారం చేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు.